ప్రైమ్ లో స్ట్రీమింగ్ ? ఆచార్య సినిమా అట్టర్ ఫ్లాప్. నిర్మాతకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల అంచనా. వీలైనంత వరకు నష్టాలను తగ్గించే ప్రయత్నంలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య ఓటీటీ రిలీజ్ పై చర్చలు జరుపుతు న్నట్టు తెలిసింది. ఆచార్యను 30 రోజుల అగ్రిమెంట్ మీద అమెజాన్ కు ఇచ్చారని, ఆ లెక్కన ఈ నెల 25 కు కాస్త అటు ఇటుగా ప్రసారం కావాల్సి వుందని తెలుస్తోంది. అయితే ఇటీవల కాస్త త్వరగా అమెజాన్ లో ప్రసారం చేసుకుంటే కాస్త అదనపు అమౌంట్ ఇచ్చే పద్ధతి ఒకటి అలవాటు అయింది. ఇప్పుడు ఈ పద్దతిని అడాప్ట్ చేయడానికి ఆచార్య ప్రయత్నిస్తు న్నట్లు సమాచారం. ఆ చర్చలు ఫలిస్తే.. బహుశా వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa