ఫిదా బ్యూటీ సాయి పల్లవి మనసు పెళ్లి వైపు మళ్లిందా ? త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోనుందా ? అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదా ? అంటే అవుననే ప్రచారం జరుగుతున్నది. గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో సందడి చేసింది సాయి పల్లవి. వీటితో పాటు 'విరాటపర్వం లో నటించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఒక్క సినిమా ఓకే చేయలేదు. దీంతో త్వరలోనే సాయి పల్లవి పెళ్లి అనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై సింగిల్ పీస్ స్పందించలేదు. కానీ ఆమె స్నేహితులు మాత్రం రెస్పాండ్ అయ్యారు. సాయి పల్లవి పెళ్లి ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఆమె కొత్త సినిమాలు ఓకే చేయకపోవడానికి కారణం డిఫరెంట్ కథల కోసం ఎదురుచూస్తుందని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa