హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకద్వయం తెరకెక్కిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ యశోద. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావురమేష్, మురళీశర్మ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజగా గ్లిమ్స్ విడుదలైంది. ఆకట్టుకునే విజువల్స్ కు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జత కావడంతో ఈ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు 12న ఈ సినిమా విడుదలకాబోతుంది.
పెళ్ళైన తర్వాత నుండి వుమెన్ సెంట్రిక్ మూవీలనే ఎక్కువగా చేస్తుంది సమంత. ఈ క్రమంలో వచ్చిన యూ టర్న్, ఓహ్!బేబీ సినిమాలు మంచి విజయాలందుకున్నాయి. ఇంకా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన పాన్ ఇండియా లేడి ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం కూడా త్వరలోనే విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa