ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ శుక్రవారం థియేటర్ లో విడుదల కానున్న సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 01:19 PM

అశోక వనంలో అర్జున కళ్యాణం: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మే 6, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.


జయమ్మ పంచాయతీ: విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమా మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.


భళా తందననా: చైతన్య దంతులూరి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భళా తందనానా' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా జంటగా నటిస్తుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాని మే 6,, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు ఈ సినిమాలో విలన్‌గా నటించారు. సత్య, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa