తమిళ సినీ హీరో సూర్యకు తెలుగులోని అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. గతేడాది వచ్చిన జై భీమ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో పాటు ఆ సినిమాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆ చిత్రం విషయంలో తమ సామాజిక తరగతిని కించపరిచారంటూ వన్నియార్లు కోర్టులో కేసు వేశారు.
సినిమా విడుదల సమయంలో ఆ సామాజిక తరగతి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. పీఎంకే పార్టీకి చెందిన అన్బుమణి రాందాస్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దీనిపై ‘రుద్ర వన్నియర్ సేన’ గతేడాది సైదాపేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా కోర్టు గురువారం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa