టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'రావణాసుర' సినిమాని నిర్మిస్తున్న అభిషేక్ నామా పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ పిక్చర్స్ తాజాగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. 'ఇడియట్స్ – ది రియల్ హీరోస్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. తెలంగాణ పల్లెటూరి ప్రేమకథ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో కలర్స్ స్వాతి రెడ్డి కథానాయికగా నటిస్తోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నిఖిల్ దేవదూల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమోఘా ఆర్ట్స్ మరియు ఎమ్‌ఎన్‌ఓపి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజీమ్ మొహమ్మద్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, సిద్దార్థ్ సదాశివుని సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa