తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ నెగటివ్ రోల్ లో కనిపిన్చనుంది అని సమాచారం. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో రజినీకాంత్ సరసన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ జోడిగా కనిపించనుంది అని సమాచారం. టెంపరరీగా 'తలైవర్ 169' అని పిలవబడే ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa