సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే ఒక్కరు. ఈ స్టార్ బ్యూటీ ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలలో నటించింది. పూజా ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ షెడ్యూల్ లో బిజీ ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిజ్లింగ్ బ్యూటీ తన తదుపరి సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'జన గణ మన' సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది అని సమాచారం. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ గా మారింది. మే 27, 2022న విడుదల కానున్న 'ఎఫ్3' మూవీలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా ఈ గ్లామర్ బ్యూటీ కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa