యాక్షన్ హీరో విశాల్ తదుపరి మూవీ పట్టాలెక్కింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ఖరారు చేశారు. చెన్నైలో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో హీరోయిన్‌గా రీతూవర్మ నటిస్తోంది. విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్. వినోద్ కుమార్ నిర్మిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa