టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన కొత్త చిత్రం అశోకవనంలో అర్జునకళ్యాణం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. విడుదలకు ముందు ప్రాంక్ వీడియోతో రాద్ధాంతం చేసిన విశ్వక్ ప్రయత్నం బాగానే వర్క్ అయినట్టుంది. BVSN ప్రసాద్ సమర్పణలో SVCC డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని చూసి బావుందని చెప్పడం విశేషం. కుర్ర హీరో సినిమాకు అంత పెద్ద దర్శకుడి నుండి బావుందంటూ కితాబు వచ్చిందంటే ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల పాజిటివ్ బజ్ క్రియేట్ అయినట్టే. సుక్కు తో పాటు ఆయన శిష్యుడు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కూడా ఈ మూవీ ని చూసి బాగుందంటూ కామెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa