ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలోకి "ఆర్ఆర్ఆర్"?

cinema |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 01:51 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ఆర్ ఆర్ ఆర్ విడుదలై నెల దాటుతున్నా ఇప్పటికీ ఘనవిజయంగా థియేటర్లలో రన్ అవుతుంది. త్వరలోనే విజయవంతంగా 50రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ ఓటిటిలో కూడా సందడి చెయ్యటానికి రెడీ అవుతుంది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆర్ ఆర్ ఆర్ మూవీ తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ భాషలలో మే 20వ తేదీ నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజునుండి హిందీ ఆర్ ఆర్ ఆర్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. 


అయితే, ఆర్ ఆర్ ఆర్ ఓటిటి రిలీజ్ కు సంబంధించి సదరు ఓటిటి సంస్థలు తమ సబ్ స్క్రైబర్లకు చిన్న ట్విస్ట్ ఇచ్చాయి. మే 20 నుండి జీ 5 లో స్ట్రీమింగ్ కానున్న ఆర్ ఆర్ ఆర్ అన్నిభాషల వెర్షన్ లకు పే పర్ వ్యూ అనే కొత్త నిబంధనను జీ 5 సంస్థ అమలు లోకి తీసుకురావాలనే ఆలోచన లో ఉన్నట్టు టాక్. దీనికోసం జీ 5 సబ్ స్క్రైబర్లు ప్రత్యేకంగా ఒక స్లాట్ ను బుక్ చేసుకోవాలి, అలానే ఒకసారి చూడటానికి కొంతమొత్తం డబ్బును చెల్లించాలి. ధియేటర్లలలో ఆర్ ఆర్ ఆర్ ను చూసే అవకాశం ప్రేక్షకులకు ఇంకా ఉంది. ఇలాంటప్పుడు, జీ 5 తీసుకొస్తున్న పే పర్ వ్యూ ఫెసిలిటీని వాడుకునే వారెవరుంటారు? జీ 5 సంస్థ చేస్తున్న ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ ఔట్ అవుతుందో?లేదో? చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa