విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహాశెట్టి జంటగా నటించిన 'డిజె టిల్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయ్యి కాసుల వర్షం కురిపించింది. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. గతంలో ఈ యంగ్ హీరో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో 'బుట్ట బొమ్మ' అనే సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి సిద్ధూ తప్పుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మూవీ మేకర్స్ కానీ సిద్ధూ జొన్నలగడ్డ కానీ ఇంకా స్పందించలేదు. 'బుట్టా బొమ్మ' సినిమా మలయాళంలో హిట్ అయిన 'కపేలాకు' అధికారిక రీమేక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa