టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో వెంకట్ ప్రభు మరియు విక్రమ్ కుమార్‌లతో సినిమాలకు సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో దర్శకుడు పరుశురామ్ తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చైతూ ఈ ప్రాజెక్ట్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. తాజాగా 'సర్కారు వారి పాట' ప్రమోషన్స్‌లో దర్శకుడే ఈ వార్తలను వెల్లడించారు. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్నారు. పరశురామ్ ప్రస్తుతం మే 12న విడుదల కానున్న మహేష్ బాబు 'సర్కార్ వారి పాట' ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa