గీతగోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం సర్కారువారిపాట. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం మే 12 న విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే..., సర్కారు వారి పాట హీరోగా మొదట అనుకున్నది మహేష్ ని కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని. అయితే ఈ వార్తలను పరశురామ్ ఒత్త పుకార్లే అని కొట్టిపారేశారు. కేవలం మహేష్ ను దృష్టిలో పెట్టుకునే సర్కారువారిపాట చిత్రకథ రాయటం జరిగిందని అసలు విషయాన్ని బయట పెట్టి, ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. అయితే గతంలో పరశురామ్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ గీతగోవిందం కూడా బన్నీ రిజెక్ట్ చేసిన తర్వాతనే రౌడీ హీరో దగ్గరికి వెళ్లిందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa