యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పీరియడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కేజీఎఫ్2. కేజీఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపు గా వచ్చిన ఈ చిత్రం థియేటర్ల వద్ద కనక వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు లని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రికార్డ్ ను సెట్ చేయడం జరిగింది. డబ్బింగ్ చిత్రం గా విడుదల అయిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల రూపాయల కి పైగా షేర్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీట్ సాధించిన తొలి డబ్బింగ్ చిత్రం ఇదే అని చెప్పాలి.
అంతేకాక ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ వసూళ్లను రాబడుతోంది. అక్కడ 400 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్లను రాబడుతోన్న ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa