వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్-3 సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ఎఫ్-2 కి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ఫుల్ కామెడీ సీన్లతో తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సోనాల్ చౌహన్, సునీల్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మే 27న థియేటర్లలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa