మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ VD #11. అయితే ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఇటీవలనే హైదరాబాద్లో పూజాకార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా తాజాగా కాశ్మీర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే ను పురస్కరించుకుని ఈ మూవీ నుండి బిగ్ అప్డేట్ ను ఎనౌన్స్ చేసారు. కాశ్మీర్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి చిత్రబృందం ఒక bts వీడియోను విడుదల చేసారు.
ఈ మేరకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మే 16న విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీంతో సమంత, విజయ్ ల అభిమానులు ఆ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ కాంబో పట్ల ప్రేక్షకులు ఒక రేంజులో అంచనాలను పెట్టుకున్నారు. మహానటి చిత్రంలో వీరిద్దరూ కలిసి జంటగా కొద్దిసేపు కనిపించరు. ఈ కొద్దిసమయమంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు విజయ్-సామ్ లు. దీంతో వీరిద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమాలో నటిస్తున్నారన్న విషయం తెలియగానే అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa