సర్కారు వారి పాట సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంవహించిన ఈ సినిమా మే 12వ తేదిన విడుదల కానుంది. ఈ తరుణంలో తెలంగాణలో టికెట్ల ధరలు పెంచేందుకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చింది. మల్టీ ప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై రూ.50, ఎయిర్ కండిషన్డ్, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.30 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా అదనపు షోలను ప్రదర్శించడానికి కూడా తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa