ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిలేరియస్ కామెడీతో ఎఫ్ 3 ట్రైలర్...మూవీ టీం సక్సెస్ సెలెబ్రేషన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 04:59 PM

వెంకటేష్, వరుణ్ తేజ్ లు తమన్నా, మెహ్రీన్ లతో కలిసి మరోసారి ఫన్ ఫస్ట్ చెయ్యటానికి రెడీ అయ్యారు. వీరు ప్రధానపాత్రలు పోషించిన ఎఫ్ 3 మే 27న విడుదల కాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వినోద ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ నిన్ననే విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఎంతో హిలేరియస్ గా సాగింది. వెంకటేష్, వరుణ్ ల ఫన్నీ యాక్టింగ్, తమన్నా, మెహ్రీన్ ల గ్లామర్ ఈ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కి, పంచ్ డైలాగ్ లకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 


తాజాగా ఈ మూవీ ట్రైలర్ సూపర్ సక్సెస్ అవడంతో మూవీ టీం హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ లో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి మిగిలిన చిత్రబృందం మొత్తం పాల్గొంది. కోవిడ్ తర్వాత కుటుంబం మొత్తాన్ని ధియేటర్ కు తీసుకొచ్చే సినిమా ఇది అని అందరూ అభిప్రాయపడ్డారు. ఎఫ్ 2 కన్నా ఎఫ్ 3 మరింత వినోదభరితంగా సాగుతుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa