బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా. ఖాన్ తో కలిసి అక్కినేని నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా లో ఒక కీలక పాత్ర పోషించాడు . అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్. లీడ్ రోల్ లో ఆమీర్ నటించగా, ఆయనకు జతగా కరీనా కపూర్ ఖాన్ నటించింది. వాస్తవానికి ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది, కానీ ఆ తేదీన కేజీఎఫ్ ఉండటంతో లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11 కు వాయిదా పడింది.
తాజాగా ఈ మూవీ నుండి మై కే కరా? అనే పాటను విడుదల చేస్తూ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. ప్రీతం స్వరపరిచిన ఈ గీతానికి అమితాబ్ భట్టాచార్య చక్కటి సాహిత్యాన్ని అందించారు. స్టార్ సింగర్ సోనూ నిగమ్ మరోసారి ఈ పాటలో తన మెలోడీ వాయిస్ తో మ్యాజిక్ చేసారు. హీరోయిన్ తో తనకు గల పరిచయాన్ని, ఆమె అందమైన ముఖాన్ని వర్ణిస్తూ హీరో పాడే పాట ఇది. ముఖ్యంగా మెలోడీ ప్రియులను ఈ గీతం ఎంతగానో ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa