కోలీవుడ్ స్టార్ యాక్టర్ సముద్రఖని ఇటీవల తెలుగులో విడుదలైన 'భీమ్లా నాయక్' మరియు 'సర్కారు వారి పాట' సినిమాలతో రెండు హిట్స్ సాధించాడు. ఈ స్టార్ దర్శకుడు అండ్ యాక్టర్ తన అద్భుతమైన నటనతో అభిమానులను మెస్మరైజ్ చేశాడు. కొన్ని రోజులగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సముద్రకని 'వినోదాయ సీతం' సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ స్టార్ దర్శకుడు ఈ విషయాన్ని అధికారకనగా ప్రకటించాడు. అతి త్వరలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని అని, జూలైలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఈ రీమేక్‌లో సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa