ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తమిళ హీరో

cinema |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 02:22 PM

తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నారు అని సమాచారం. 'మామన్నన్' తన చివరి సినిమా అని వెల్లడించారు. తన రాజకీయ జీవితంపై దృష్టి సారించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉదయనిధి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు. ప్రస్తుతం ఆయన చేపాక్-తిరువల్లికేణి నియోజకవర్గం ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్నారు. సినిమా, రాజకీయ కెరీర్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని ఈ స్టార్ హీరో అన్నారు. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన 'మామన్నన్' సినిమాలో కీర్తి సురేష్ మరియు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం, ఉదయనిధి ఆర్టికల్ 19 అధికారక తమిళ రీమేక్ అయిన 'నెంజుకు నీది' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అరుణ్‌రాజా కామరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa