'గల్లీ బాయ్' వంటి కొన్ని హిట్ సినిమాలని అందించిన జోయా అక్తర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ది ఆర్చీస్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, గ్లామర్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా కనిపించనున్నారు. ఫన్ పీరియాడికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa