ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఖుషి” ఫస్ట్ లుక్ కి విశేష స్పందన!

cinema |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 01:54 PM

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా  తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని, రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.   


 ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్ మరియు రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టైటిల్ తోనే ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa