సైలెంటుకు మారుపేరుగా ఉండే హీరో మహేష్ బాబు ఉ కర్నూలు లో జరిగిన కార్యక్రమంలో హఠాత్తుగా స్టేజి మీదికి వచ్చి స్టెప్పులేయడం ఆయన అభిమానులకు సైతం షాక్ కు గురి చేసింది. మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా విడుదలయిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన విడుదలయిన ఈ సినిమా తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిన్న రాత్రి 'కర్నూల్' లో నిర్వహించారు. దర్శక నిర్మాతలతో పాటు మహేశ్ బాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎప్పుడూ లేని విధంగా మహేశ్ బాబు తనంతట తానుగా స్టేజ్ పైకి వచ్చి, 'మ మ మహేశా' పాటకి స్టెప్పులు వేయడం విశేషం. హఠాత్తుగా ఆయన అలా చేయడంతో తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని తమన్ అనడంతో మహేశ్ బాబు నవ్వేశారు. ఈ సినిమాలో తనకి బాగా నచ్చింది లవ్ ట్రాక్ అని మహేశ్ చెప్పడం మరో విశేషం.
ఇక ఈ సినిమా ఫ్లాప్ అనీ .. వసూళ్లు డ్రాప్ అయ్యాయనే ఒక ప్రచారం జరుగుతోంది. వాటికి తెరదింపాలనే ఉద్దేశంతో, 'ఇప్పుడే అందిన వార్త .. ఈ సినిమా మరో రెండు కోట్లను వసూలు చేసింది .. దీంతో 95 కోట్ల షేర్ రాబట్టినట్టు అయింది' అని స్టేజ్ పైన యాంకర్ శ్యామలతో చెప్పించారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతూ మహేశ్ బాబు హర్షాన్ని వ్యక్తం చేశాడు. నేడో .. రేపో ఈ సినిమా 100 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa