ఇటీవల ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ పరిపాటిగా మారుతోంది. బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో డింపుల్ హయతితో ఒక ఐటమ్ సాంగ్ రూపొందుతున్న ట్లు సమాచారం.ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుంది. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ సినిమా కోసం మాస్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ నెంబర్ ను తమన్ కంపోజ్ చేశాడట. ఆ పాటను డింపుల్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
'గద్దలకొండ గణేశ్' సినిమాలో 'జర్రా జర్రా' ఐటమ్ సాంగ్ తో ఆమె కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఆ తరువాత రవితేజ సరసన కథానాయికగా 'ఖిలాడి' సినిమాలో అందాలను ఆరబోసింది.
ఈ సినిమాతో గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో కలిసి ఆమె ఒక మాస్ మసాలా సాంగ్ లో సందడి చేయనున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య 107వ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa