డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ప్రగ్యా జైస్వాల్ నటించిన "సన్ ఆఫ్ ఇండియా" సినిమా ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదలయింది. మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్‌గా మారారు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు 'సన్ ఆఫ్ ఇండియా' సినిమా డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. మూవీ మేకర్స్ కానీ, OTT ప్లాట్‌ఫారమ్ కానీ డిజిటల్ డెబ్యూని ప్రకటించలేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa