టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉన్న హీరోస్ లో ఒక్కరు. ఈ స్టార్ హీరో నటించిన 'RRR' బాక్స్ఆఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ స్టార్ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో ఒక సినిమాకి కూడా సైన్ చేసినట్లు సమాచారం. గతంలో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, రామ్ చరణ్ కి ఒక స్క్రిప్ట్ చెప్పినట్లు వార్తలు వినిపించాయి. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో 'విక్రమ్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, రామ్ చరణ్‌కి ఫోన్ చేసి కథను చెప్పడానికి డేట్ అడిగినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa