తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన OTT ప్లాట్ఫారంలో ఆహా ఒక్కటి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలతో అండ్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటుంది. ఆహా ప్లాట్‌ఫామ్ తమిళ, మలయాళ చిత్రాలను డబ్ చేసి విడుదల చేసింది. ఈ మే నెలలో తెలుగులో దాదాపు 30కి పైగా హాలీవుడ్ సినిమాలను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మెన్ ఇన్ బ్లాక్ 3, ది అడ్వెంచర్స్ ఆఫ్ టిన్టిన్, రెసిడెంట్ ఈవిల్, రెసిడెంట్ ఈవిల్: ఎక్స్‌టింక్షన్ అండ్ జంగో అన్‌చెయిన్డ్ సినిమాలు మే 20, 2022న ఆహాలో విడుదల కానున్నాయి అని సమాచారం. అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని డబ్బింగ్ సినిమాలు ఆహాలో విడుదల కానున్నాయి అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa