పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ప్రధాన పాత్రలలో కరుణాకరన్ తెరకెక్కించిన చిత్రం తొలి ప్రేమ. జూలై 24, 1998న విడుదలైన ఈ చిత్రం పవన్ కెరియర్‌లోనే బెస్ట్‌గా నిలిచింది. యువతను ఉర్రూతలూగించి ప్రేమ మధురిమను చవిచూపించిన తొలిప్రేమ చిత్రం అప్పుడప్పుడే యవ్వనంలోకి వస్తున్నవారికి మహా కావ్యంగా తోచింది. దాదాపు సంవత్సరంపాటు ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది . ఇక పవన్ కళ్యాన్ అద్భుత నటన, డైరెక్టర్ పనితనం, పాటలు అప్పటి యువతనే కాదు, నేటి యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయి. నేటితో ఈ క్లాసికల్ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పవన్ అభిమానులు 20YearsOfClassicTHOLIPREMA అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. తొలి ప్రేమ అనే టైటిల్‌తో రీసెంట్‌గా వరుణ్ తేజ్ కూడా ఓ చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రేక్షకుల మనసులని గెలుచుకుంది. అప్పటి తొలి ప్రేమ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన సినిమాలకి దూరం కాగా, కీర్తి రెడ్డి పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి విదేశాలకి వెళ్లింది. ఈ క్రమంలో సినిమాలకి గుడ్ బై చెప్పింది. తొలి ప్రేమ లాంటి అద్బుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కరుణాకరన్ చాలా గ్యాప్ తర్వాత మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో తేజ్ ఐ లవ్ యూ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించాడు. ఈ సినిమా అభిమానులని నిరాశపరచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa