ముత్తయ్య దర్శకత్వంలో కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీ ఒక యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'విరుమాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కార్తీ సరసన అదితి శంకర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శరణ్య, సూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాని ఆగస్ట్ 31, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జోతిక ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa