జూన్ 1న అమెరికాలోని 100 థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' సినిమా మళ్లీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను కేవలం జూన్ 1 మాత్రమే ఆ థియేటర్లలో ప్రదర్శిస్తారు. స్పెషల్ స్క్రీనింగ్ పేరుతో సినిమాలో తీసేసిన సీన్స్ ని యాడ్ చేసి ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ అన్‌కట్ వెర్షన్ సినిమాను చూడటం కోసం టిక్కెట్లు వేగంగా అమ్ముడయ్యాయట.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అమెరికాలో మరోసారి విడుదల కాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa