బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ధాకడ్. గూఢచారి తరహా యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు రజనీష్ ఘాయ్ ఈ మూవీ ని తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజులో ఈ చిత్రం మే 20 న రిలీజ్ అవ్వబోతుంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల నుండి కంగనా అండ్ టీం ప్రచారకార్యక్రమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఈ సినిమా నుండి టైటిల్ థీమ్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమం ముంబై ప్రేక్షకాభిమానుల కోలాహలం మధ్య ఎంతో ఘనంగా జరిగింది. తూ హై ధాకడ్ అనే పాటను గంగానదీ తీరాన తేలియాడే LED తెరలపై (ఫ్లోటింగ్ LED స్క్రీన్స్)పై ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ పాటను ప్రఖ్యాత యాడ్ అండ్ మూవీ కంపోజర్ ధృవ్ ఘనేకర్ స్వరపరిచారు. ఇషితా అరుణ్ సాహిత్యాన్ని అందించగా, వసుంధరా వీ పాడారు. ఈ సినిమాలో ఏజెంట్ అగ్ని పాత్రలో కఠినమైన యాక్షన్ సీక్వెన్స్ ను కంగనా చేసిందని అంటున్నారు. బాలీవుడ్ హీరోలను తలదన్నుతూ కంగనా చేసిన పోరాట సన్నివేశాలు మూవీకి హైలైట్ గా నిలువనున్నాయని చిత్రబృందం ప్రచారం చేస్తుంది. ఏజెంట్ అగ్ని సౌర్యాన్ని, వీరత్వాన్ని ఈ పాటలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa