'మైనా' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కోలీవుడ్ దర్శకుడు ప్రభు సోలమన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి 'సెంబి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ సెంబి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన కోవై సరళ కూడా సీరియస్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్ధురాలి క్యారెక్టర్‌ని పోషిస్తున్నట్లు సమాచారం. ఇంటెన్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ చిత్రాన్ని AR ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్‌పై R రవీంద్రన్, అజ్మల్ ఖాన్ మరియు రేయా నిర్మించారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa