వెండితెరపై మరో చారిత్రక కావ్యం ఆవిష్కృతమవబోతుంది. సామ్రాట్ పృథ్విరాజ్ చౌహన్ బయోపిక్ గా, బాలీవుడ్ లో పృథ్విరాజ్ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్, మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ జంటగా నటించారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ యష్ రాజ్ సంస్థ భారీ బడ్జెట్టుతో నిర్మించింది. హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కాబోతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే ట్రైలర్, ప్రోమో సాంగ్స్ రిలీజయ్యి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు యుద్ధ సన్నివేశాలతో, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. మధ్యలో రాణి సంయోగిత (మానుషీ చిల్లర్) తో లవ్ ట్రాక్ కూడా చూపించారు. భారీ తారాగణంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయి. విడుదలైన తర్వాత ఈ మూవీ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అని బాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa