బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్, ఆ సినిమాతో తన వరస ఫ్లాప్స్ కు బ్రేక్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ చిత్ర విజయోత్సాహంతో ఏజెంట్ సినిమాను చకచకా కానిచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పక్కా స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా తన డిజిటల్ భాగస్వామిని ఖరారు చేసుకుందని సమాచారం. ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ సొంతం చేసుకుందని చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa