కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తన మొదటి వెబ్ సిరీస్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'రానా నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా కనిపించనున్నారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ గురించి రానా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో 'రానా నాయుడు' షూటింగ్ పూర్తయిందని ప్రకటించడానికి ఒక స్టోరీ ని పోస్ట్ చేశాడు. ఈ సిరీస్ విడుదల తేదీని త్వరలో మూవీ మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ క్రైమ్ డ్రామా పాపులర్ అమెరికన్ టీవీ సిరీస్ 'రే డోనోవన్' కి ఆధారంగా రూపొందిస్తున్నారు. లోకోమోటివ్ గ్లోబల్ మీడియా LLPకి చెందిన సుందర్ ఆరోన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa