అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన 'హీరోపంతి 2' ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన తారా సుతారియా నటించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ సినిమా మే 27, 2022 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది అని సమాచారం. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa