2017 లో మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ డ్రామాలో మానుషి సంయోగితగా కనిపించనుంది. అయితే యాక్ట్రెస్ గా మారిన ఈ మోడల్ కి యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాతలు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'పృథివీరాజ్' జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa