12వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో రెండు అవార్డ్స్ ని అందుకున్న వైజాగ్‌కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు ఒక ఆంగ్ల చిత్రాన్ని రూపొందించడం తెలుగువారికి గర్వకారణం. అంతేకాకుండా ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022లో CETలో ప్రదర్శించబడుతోంది. 'ఎ బ్యూటిఫుల్ బ్రేకప్' అనే ఇంగ్లీష్ రొమాంటిక్-థ్రిల్లర్ మూవీకి ప్రముఖ కన్నడ దర్శకుడు అజిత్వాసన్ ఉగ్గిన దర్శకత్వం వహించారు. క్రిష్ ముద్రగడ, మటిల్డా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాకి కెఆర్ గుణశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా శ్రీకాంత్ గౌడ ఎడిటింగ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa