దర్శకుడు బాలాతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 41' అని పేరు పెట్టారు. రాజశేఖర్ పాండియన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కృతి శెట్టి జంటగా నటిస్తుంది. తాజాగా బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై వచ్చిన వార్తలను సూర్య ఖండించారు. సూర్య దర్శకుడు బాలాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 'వెయిటింగ్ టు బి బ్యాక్ సెట్స్...!!' అంటూ ఆ ఫోటోకి కాప్షన్ ఇచ్చాడు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అండ్ 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa