ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'జన గణ మన'

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:24 PM

డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'జన గణ మన' సినిమా  OTT ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా జూన్ 2, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఇదే విషయాన్ని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా ఈ సినిమాని తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సూరజ్ వెంజరమూడు ఈ సినిమాలో పోలీసుగా నటించాడు. విన్సీ అలోషియస్, సిద్ధిక్, బెంజి మాథ్యూస్, ఆనంద్ బాల్, లిటిల్ దర్శన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa