మే 28న అంటే ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భం గా టాలీవుడ్ నటసింహ బాలకృష్ణ ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ని చేయనున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం 10.20 గంటలకు ఈ ప్రత్యేక ప్రకటన వెలువడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, బిటిఆర్ క్రియేషన్స్ అనే బ్యానర్‌ని ప్రారంభించి మొదటి ప్రాజెక్ట్‌ను ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రకటించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రానున్న చిత్రాన్ని ఈ బ్యానర్ నిర్మిస్తుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం తన కొత్త సినిమా 'NBK107' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa