"పుష్ప: ది రైజ్" సినిమా తర్వత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేమ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. ఈ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం, బన్నీ ఫేమస్ ఫుడ్ డెలివరీ జొమాటో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈ బ్రాండ్‌ను ఎండార్స్ చేయడానికి బన్నీ 3 సంవత్సరాలకి తొమ్మిది కోట్ల ఛార్జ్ చేసాడు. తాజాగా ఇప్పుడు బన్నీ మరో బ్రాండ్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. బిల్డింగ్ మెటీరియల్స్‌లో టాప్ కంపెనీలలో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా బన్నీని సెలెక్ట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa