కన్నడ మూవీస్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విక్రాంత్ రోనా' సినిమా ఒకటి. అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో నటించిన మరో సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విడుదలవుతోంది. నవంబర్ 2021 లో విడుదలైన 'కోటిగొబ్బ 3' ఇప్పుడు తెలుగులో 'K3 కోటికొక్కడు' టైటిల్ తో జూన్ 17, 2022న విడుదల కానుంది. ఈ సినిమాలో కిచ్చా సుదీప్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్, రవిశంకర్, నవాబ్ షా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa