ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ప్రధాన పాత్రల్లో తెరకెక్కెతున్న మూవీ నీవెవరో. రచయిత కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.. హరినాధ్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.. ఈ మూవీలో ఆది అంధుడిగా కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ కన్నడ మూవీ అదే కంగల్ కు రీమేక్. ఒరిజినల్ వెర్షన్‌లో కలైయారసన్ హరికృష్ణనన్ కనిపించిన పాత్రలో ఆది నటించనున్నాడట. ఇదే కథతో తెలుగు, తమిళ భాషల్లో నీవెవరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించారు. కాగా చిత్ర హీరోయిన్ తాప్సీ పుట్టినరోజు కావడంతో ఆమెకు చిత్ర యూనిట్ జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ ఈ మూవీని ఈ నెల 24వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.