అద్వైత్ చందన్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "లాల్ సింగ్ చద్దా" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా 1994లో రిలీజ్ అయినా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ "ఫారెస్ట్ గంప్" హిందీ రీమేక్. ఈ సినిమాలో కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ సినిమా ట్రైలర్‌లో అమీర్ ఖాన్ డామినేట్ చేయడంతో కీలక పాత్రలో నటిస్తున్న చై అక్కినేని పెద్ద హైలైట్ గా కనిపించలేదు. ఈ విషయంపై చాలా మంది అక్కినేని అభిమానులు నిరాశ చెందారు. ఈ సినిమా 2022 ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa