దర్శకుడు అయాన్ ముఖర్జీ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో 'బ్రహ్మాస్త్ర' సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌని రాయ్ అండ్ నాగార్జున అక్కినేని ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం అండ్ కన్నడ భాషలలో విడుదల కానుంది. తాజాగా మాగ్నమ్ ఓపస్ మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 15, 2022న అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడానికి ట్రైలర్ టీజర్‌ను విడుదల చేసారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ సినిమాకి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.