టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే వెంకట్ ప్రభు, పరశురామ్ మరియు విక్రమ్ కుమార్‌లతో సినిమాలకు సైన్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ దర్శకుడు, తరుణ్ భాస్కర్ ఒక స్క్రిప్ట్‌ను చైకి వినిపించగా ఈ స్క్రిప్ట్ కి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో వేచి చుడాలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.