దేత్తడి అందాలకు పోరగాళ్లు ఫిదా అవుతున్నరు. అలేఖ్య హారిక అంటే ఎవరు గుర్తు పట్టరేమో..! కానీ దేతడి హారిక అంటే తెలియని వారుండరు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ హారిక చేసిన వీడియోలు యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అయ్యాయి. వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తో క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ షోలో అవకాశం దక్కింది. బిగ్ బాస్ సీజన్-4లో చిచ్చుబుడ్డిలా పేలింది.. ఫినాలే వరకు వెళ్లింది తెలంగాణ ఆడబిడ్డ. ప్రస్తుతం హారికకు తెలుగు, తమిళ్ లోనూ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది 'గానం' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది హారిక. జనవరి 28 నుంచి 'గానం' డిస్నే ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హీరోయిన్ గా రాణించాలని ఆశపడుతున్న హారిక అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. చీర కట్టులో, ట్రెండీ వేర్ లో ఫోటో షూట్స్ చేస్తోంది. దర్శక-నిర్మాతలను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో హారిక లెటెస్ట్ పోజులు పోరగాళ్ల మతులు పోగొడుతున్నయి.